Site icon Housing News

ప్రధానమంత్రి 13వ వాయిదా: లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చూసుకోవాలి?

How to view PM Kisan beneficiary list?

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఫిబ్రవరి 27, 2023 నాడు ప్రధానమంత్రి కిసాన్ 13వ వాద్యిదా ను కర్నాటక నుండి విడుదల చేశారు. అర్హులైన రైతులు 13వ వాయిదాను అందుకొనుటకు ఫిబ్రవరి 10, 2023 నాటికి ఈ-కేవైసి ని పూర్తి చేయవలసి ఉంటుంది. తమ ఖాతాలో రూ. 2,000 వాయిదా క్రెడిట్ కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులు, ఈ క్రింది దశల-వారి గైడ్ ను అనుసరించి జాబితాలో తమ పేర్లను చూసుకోవచ్చు.

Table of Contents

Toggle

 

2023లో ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల స్థితిని ఎలా పరీక్షించుకోవాలి?

భారతదేశములో కేంద ప్రభుత్వము ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన  (ప్రధాని కిసాన్) కింద సంవత్సరములో భూ-యజమానులైన రైతులకు 3 సమాన వాయిదాలలో రూ. 6,000 వార్షిక ఆర్ధిక సహకారాన్ని అందిస్తుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరును పరీక్షించుకొనుటకు, ఈ దిగువన-పేర్కొనబడిన దశలను అనుసరించండి:

 

దశ 1: ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితాను పరీక్షించుటకు నేరుగా క్రింది లింక్ పై క్లిక్ చేయండి: https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

 

 

దశ 2: ఓపెన్ అయిన పేజ్ పై, డ్రాప్-డౌన్ మెనూల నుండి, మీరు ఈ క్రింది విధంగా అడగబడతారు:

1. రాష్ట్రాన్ని ఎంపిక చేయండి

 

2. జిల్లా ఎంపికచేయండి

 

3. ఉపజిల్లా ఎంపికచేయండి

 

4. బ్లాక్ ఎంపికచేయండి

 

5. గ్రామాన్ని ఎంపిక చేయండి

 

దశ 3: మీరు ప్రతి ఒక్కటి ఎంపిక చేసిన తరువాత, ‘రిపోర్ట్ అందించు’ ఎంపిక పై క్లిక్ చేయండి.

 

 

దశ 4: స్క్రీన్ పై ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. పూర్తి జాబితాను చూసేందుకు కిందికి స్క్రోల్ చేస్తూ ఉండండి.

 

 

ప్రధానమంత్రి కిసాన్ స్థితి చెక్ పై మా పూర్తి గైడ్ ను అనుసరించడము ద్వారా కూడా మీరు మీ సబ్సిడి స్థితిని పరీక్షించవచ్చు. అలాగే మీ ప్రధానమంత్రి కిసాన్ ఈ-కేవైసి పూర్తి చేయుట ఎలా అనేది తెలుసుకోండి.

 

ప్రధానమంత్రి కిసాన్ యోజన 2023 కొరకు ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి?

దశ 1: ప్రధానమంత్రి కిసాన్ కొరకు నమోదు చేసుకొనుటకు, అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ‘రైతుల కార్నర్’ కింద ‘కొత్త రైతు నమోదు’ ఎంపికను ఎంపికచేయండి.

 

 

దశ 2: ప్రధానమంత్రి కిసాన్ నమోదు పత్రములో అన్ని వివరాలను ఎంటర్ చేయండి మరియు ‘ఓటిపి పంపించు’ పై క్లిక్ చేయండి. తనిఖీ కొరకు ఓటిపి ని ఎంటర్ చేయండి మరియు మీరు ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్ పై నమోదు చేయబడతారు.

 

 

ప్రధానమంత్రి కిసాన్ కేవైసి 2023

ప్రధానమంత్రి కిసాన్ పథకము కొరకు దరఖాస్తు చేసే రైతులు తమ కేవైసి పూర్తి చేసినప్పుడు మాత్రమే తమ ఖాతాలోకి 13వ వాయిదాను అందుకోగలుగుతారు. ప్రధానమంత్రి కిసాన్ నమోదు అయిన రైతుల కొరకు ఈకేవైసి తప్పనిసరి. ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్ పై ఓటిపి-ఆధారిత ఈకేవైసి అందుబాటులో ఉండగా, సమీప సిఎస్‎సి కేంద్రాలలో బయోమెట్రిక్-ఆధారిత ఈకేవైసి చేయవచ్చు.

 

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల జాబితా 2023 అవలోకనం

1వ వాయిదా   3.16 కోట్ల రైతులు

2వ వాయిదా   6 కోట్ల రైతులు

3వ వాయిదా   7.66 కోట్ల రైతులు

4వ వాయిదా   8.20 కోట్ల రైతులు

5వ వాయిదా   9.26 కోట్ల రైతులు

6వ వాయిదా   9.71 కోట్ల రైతులు

7వ వాయిదా   9.84 కోట్ల రైతులు

8వ వాయిదా   9.97 కోట్ల రైతులు

9వ వాయిదా   10.34 కోట్ల రైతులు

10వ వాయిదా 10.41 కోట్ల రైతులు

11వ వాయిదా 10.45 కోట్ల రైతులు

12వ వాయిదా 8.42 కోట్ల రైతులు

13వ వాయిదా 8 కోట్ల రైతులు

ఇది కూడా చూడండి: ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్ ఎలా ఉపయోగించాలి?

 

ప్రధానమంత్రి కిసాన్ ఈకేవైసి ఆన్లైన్ 2023

దశ 1: ప్రధానమంత్రి కిసాన్ అధికారిక వెబ్సైట్ పై, పేజీ కుడివైపున ఉన్న ‘రైతుల కార్నర్ కింద ‘కేవైసి ఎంపికపై క్లిక్ చేయండి

 

 

లేదా, ఈ క్రింది లింక్ ను మీ బ్రౌజర్ లో కాపీ మరియు పేస్ట్ చేయవచ్చు: https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx

 

దశ 2: తరువాతి పేజ్ పై, మీ ఆధార్ నంబర్ ను అందించండి. ‘సెర్చ్’ ఎంపికపై క్లిక్ చేయండి.

 

 

దశ 3: ఇప్పుడు మీరు మీ నమోదు చేయబడిన మొబైల్ నంబర్ పై 4-అంకెల ఓటిపి ని అందుకుంటారు. దీనిని తరువాతి పేజ్ పై ఎంటర్ చేయండి మరియు ‘సబ్మిట్ ఓటిపి’ ఎంపికపై క్లిక్ చేయండి. దీనితో, మీ ప్రధానమంత్రి కిసాన్ ఈకేవైసి పూర్తి అవుతుంది.

గమనిక: ఒకవేళ మీరు అందించిన సమాచారము చెల్లుబాటు అయ్యేది కాకపోతే, ఈ కేవైసి పూర్తి కాదు. తమ ప్రధానమంత్రి కిసాన్ ఈకేవైసి ని ఇదివరకే పూర్తి చేసినవారికి, ఈకేవైసి ఇదివరకే చేయబడింది అని ఒక మెసేజ్ వస్తుంది.

 

ప్రధానమంత్రి కిసాన్ ఈకేవైసి ఆఫ్లైన్

దశ 1: సమీప కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించండి. సమీప సీఎస్‎సి ని కనుగొనుటకు, ఇక్కడ క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డును మరియు నమోదు చేయబడిన మొబైల్ నంబరును వెంట తీసుకెళ్ళండి.

దశ 2: మీ ఆధార్ మరియు ఇతర వివరాలను సిఎస్‎సి ఆపరేటర్ కు అందించండి.

దశ 3: అలాగే కేంద్రము వద్ద మీ బయోమెట్రిక్స్ ను కూడా అందించండి, బొటనవేలిముద్రతో సహా.

దశ 4: అతని లాగిన్ ను ఉపయోగించి, బయోమెట్రిక్ ప్రామాణీకరణ కొరకు సిఎస్‎సి ఆపరేటర్ వివరాలను కంప్యూటర్ లోకి ఎంటర్ చేస్తారు. దీని తరువాత, మీ ఈకేవైసి అప్డేట్ అవుతుంది మరియు మీ మొబైల్ పై ఒక మెసేజ్ అందుకుంటారు.

 

ప్రధానమంత్రి కిసాన్ 13 వాయిదా అందుకొనుటకు 4 తప్పకచేయవలసిన పని

ఈ క్రింది షరతులను నెరవేర్చిన రైతులకు 13వ వాయిదా అందించబడుతుంది:

  1. భూమి యజమానిగా అతని పేరును చూపించే భూ రికార్డు రుజువు
  1. కేవైసి
  1. బ్యాంక్ ఖాతా ఆధార్ తో అనుసంధానించబడి ఉండాలి
  1. బ్యాంక్ ఖాతా ఎన్‎పిసిఐ తో అనుసంధానించబడి ఉండాలి

ఒకవేళ రైతు ఈ షరతులన్నిటిని నెరవేర్చకపోతే, అతని పేరు ప్రధానమంత్రి కిసాన్ 13వ వాయిదా జాబితాలో చేర్చబడదు.

 

తాజా వార్తలు 

10.45 కోట్ల రైతులు ప్రధానమంత్రి కిసాన్ 11వ వాయిదాతో లబ్ధిపొందారు

ప్రధానమంత్రి-కిసాన్ పథకము కింద లబ్ధిదారుల సంఖ్య మొదటి వాయిదా విడుదల సమయములో (డిసెంబరు 2018 – మార్చ్ 2019) 3.16 కోట్ల నుండి 11వ వాయిదా విడుదల సమయములో (ఏప్రిల్ 2022 – జులై 2022) 10.45 కోట్లకు పెరిగిందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఫిబ్రవరి 7, 2023 నాడు లోక్ సభలో తెలిపారు.

పూర్తి కవరేజ్ ను చదువుటకు, ఇక్కడ క్లిక్ చేయండి.

 

ప్రధానమంత్రి కిసాన్ కింద ప్రభుత్వము రూ. 2.2 లక్ష కోట్ల నగదు బదిలీ చేసింది: బడ్జెట్ 2023 – 24

ప్రధానమంత్రి కిసాన్ కింద ప్రభుత్వము రూ. 2.2 లక్ష కోట్ల నగదు బదిలీ చేసిందని ఆర్ధిక మంత్రి (ఎఫ్‎ఎం) నిర్మలా సీతారామన్ అన్నారు. ఫిబ్రవరి 1, 2023 నాడు కేంద్ర బడ్జెట్ 2023 – 24 ను ప్రవేశపెట్టినప్పుడు ఎఫ్‎ఎం ఈ ప్రకటన చేశారు. అలాగే, సుమారు 3 లక్షలమంది మహిళా రైతులు ప్రధానమంత్రి-కిసాన్ పథకము కింద లబ్ధి పొందారు, వీరిని ఇంతవరకు రూ. 54,000 కోట్ల నగదు బదిలీ చేయబడిందని జనవరి 31, 2023 నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారు చెప్పారు.

 

ప్రధానమంత్రి కిసాన్ పథకము కవర్

తన ఏప్రిల్-జులై 2022 – 23 చెల్లింపు సైకిల్ లో ప్రధానమంత్రి కిసాన్ పథకము కింద సుమారు 11.3 కోట్లమంది రైతులు కవర్ చేయబడ్డారు అని లోక్ సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ద్వారా జనవరి 31, 2023 నాడు ప్రవేశపెట్టబడిన ఎకనామిక్ సర్వే 2023 తెలిపింది. 3 సంవత్సరాల వ్యవధిలో, కేంద్ర పథకము విజయవంతంగా దేశములోని కోట్లమంది రైతులకు రూ. 2 లక్షల కోట్ల సహకారాన్ని అందించింది అని సర్వే తెలిపింది. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ పథకము కింద సబ్సిడి మొత్తాన్ని పెంచాలని పెరుగుతున్న డిమాండ్ నేపథ్యములో, ప్రభుత్వము ఈ సంవత్సరము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 13వ వాయిదాను విడుదల చేస్తుందని ఆశించబడుతోంది.

ప్రకటన తరువాత, తమ ఈ-కేవైసి పూర్తి చేసిన అర్హులైన రైతులు తమ ఖాతాలలో రూ. 2,000 అందుకుంటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వ సబ్సిడీల కొరకు దరఖాస్తు చేసిన రైతులు ఈ క్రింది సులభమైన దశలను అనుసరించి లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్ లో చూడవచ్చు. ఈ గైడ్ ఆ దశల గురించి విశదీకరిస్తుంది.

 

ఎఫ్ఏక్యూలు (FAQs)

ప్రధానమంత్రి కిసాన్ పథకము ఎప్పుడు అమలులోకి వచ్చింది?

ప్రధానమంత్రి కిసాన్ యోజన డిసెంబరు 1, 2018 నుండి అమలులోకి వచ్చింది.

ప్రధానమంత్రి కిసాన్ సబ్సిడీ కొరకు ఎవరు అర్హులు?

ప్రధానమంత్రి కిసాన్ సబ్సిడీ కొరకు ఈ క్రింది వారు అర్హులు: సాగు భూమి కలిగిన భూ-యజమానులు అయిన రైతు కుటుంబాలు. పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు. చిన్న మరియు వెనుకబడిన రైతు కుటుంబాలు.

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సబ్సిడి ఎలా చెల్లించబడుతుంది?

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద, దేశములోని అర్హులైన రైతు కుటుంబాలకు అందరికి సంవత్సరానికి రూ. 6,000 ఆర్ధిక సహకారము ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున 3 సమానమైన వాయిదాలలో చెల్లించబడుతుంది.

ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఏ వివరాలు పేర్కొనబడ్డాయి?

ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితాలో, మీకు లబ్ధిదారుడు అయిన రైతు పేరు, అతని తండ్రి పేరు, అతని లింగము మరియు అతని చిరునామా వంటి వివరాలు ఉంటాయి.

ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితాను పరీక్షించుటకు ఉన్న డైరెక్ట్ లింక్ ఏమిటి?

https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx అనేది ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితాను పరీక్షించుటకు ఉన్న డైరెక్ట్ లింక్

Was this article useful?
  • ? (1)
  • ? (0)
  • ? (0)
Exit mobile version